Posts

Showing posts from August, 2020

ఏకానేకుడు!

Image
విశ్వరూపాన్ని,వటపత్రశాయి ఉదరంలో చూసిన  మార్కండేయ మహర్షి,ధర్మరాజుకి చెప్పిన, విశేషాల నేపథ్యం తో వ్రాసినది:, (మహాభారతం,వనపర్వం ) ఏకానేకుడు!! ఎవ్వరు లేని నిరామయమ్మున, ఆ జలా ర్ణవమ్మున/ సవ్వడియే లేని నిబిడ మౌనమ్ముల యు గాంతమ్ముల/ నవ్వుచు డోలలూగెదో దేవ,ఓంకారమ్మది  నీ లోనే / రవళింప,అనధ్యయన వేళల ఋష్యాశ్రమ సమువై!!                             ( ii) జగద్భాండములనె కుక్షిని దాచిన లక్ష్మీ ధర హరే,స్థూల/ న్యగ్రోధము పగిది కాదే నీ సంకల్ప బీజ ప్రభ వమై పృథు/    సగుణమ్మంతయు,వెలయించి ఒకపరి,లోగొని నొకపరి/ మంగళమనెడి నవజాత మూలకందములీవె యగుచున్!!                               ***** (అనధ్యయన వేళల్లో/రోజుల్లో వేదం బోధింప బడదు, పఠింప బడదు కానీ ఆ ఆశ్రమ వీధుల్లో, గాలిలొ, ఆక్కడే ఉంటుంది, వినిపించకుండా! అట్లాంటి ఆశ్రమ సమం ఈ ఉదరం! ఈ స్థితిలో వేదాలు, వినిపించట్లేదు కానీ ఆయన లోపలే ఉన్నాయి అని)                 ...

వహోత్సహులు!!

Image
గహన వన, నగరాజాబ్ధి నదీనద గురు భర వహుడైన అహీశుడట్లు,బహుళ మౌక్తికాలంకార వజ్ర వైఢూర్య నిబధ్ధ మహాహిరణ్య ధూర్వహానందమూర్తివై నీవిట్లు భళిర,ఈ భృత్య గృహమేధుల భరణోత్సుకల్,నిత్యకళ్యాణ!శ్రీవేంకటేశ్వరా!

ఆంధ్రకేసరి!

Image
లోకమాన్య,ఆంధ్ర కేసరులు త్రాతలై నేతలై,దళపతులై/ ఏకము చేసిరి,నరనారీ గణముల రాక్షస నీతుల నెదిర్ప/ చీకాకుల కకావికలై తోకల ముడిచిరి, మ్రుక్కడి శ్వేతులు/ శోకము పారము తాకునేమో నేటి పదవీ లాలసతల జూచిన!                 ( ii) ఏ కోశమున స్వార్థము లేక ధనమాన ప్రాణ త్యాగముల/ నేకోన్ముఖులై చేసిన, అవ్వారికి, భారత జనని అశ్రువులన్ !!                

వందనమయ్య!

Image
మట్టి వినాయకుడిదే,మట్టసముగ కొలువు దీర్చే పెట్టండిక దణ్ణాలు దస్కాలు,మీ చెవుల పట్టుకొనీ కుడుములుండ్రాళ్ళను మరిచిత్తాల భక్తినింపుకొని చట్టున్న విఘ్నాలు తొలగీ,విజయాలపట్టుటకును

తొలి దేవర!

Image
వేగి,దర్శనమే వెల్గు వాక, లోకపు పగటి దీపమై! నింగి రంగులవెల్లువాయె,వసుమతి ప్రాణవంతమై ఖగము రాగముతీసే గరికపూవాడెఆశమేల్కాంచె యుగయుగమ్ముల కౌశలపూర్ణుడినునకుప్రణతుల్

నిద్ర!

Image
ఇది అది యని ఏ మెరుగని వాడు ఎది చూసిన అబ్బురపడు బుడత ఒద్దికగ తల్లి యొడి నుండు వాడిట సుధ్యానమేమో,నిద్ర సుఖమెరుగునే?!

సీతారాములు!

మట్టి దీపాలె మణులాయే మేనుల తాకి వట్టి పోరాదని తండ్రి ఇచ్చిన మాట,పట్టు పుట్టాల పట్టాభిరాముడు,కట్టి నారబట్టల చెట్టు పుట్టల అడవుల గడిపె,ఎట్టి పాటుల                             (ii)  గట్టిగ చేపట్టి ధర్మ కరము,సూటిగ నడచే  చెట్టపట్టిన దీపశిఖ సీత వెల్గ,సహచరియై!!

సాయము!

Image
      చేతనైన చిరు సాయ మొరులకు తప్పక/       ప్రతివారు చేయు పూనిక దాల్చిన,ఆప్తతా/       ఛత్రమై కరుణ వెల్లి విరియు నందరిలో!/       బాతువు పక్షము చాపి,చూపె నీ చిత్రమున్!                                   ( 2)       రెక్క తెరవగనె పెద్దయై అక్కున జేర్చు                  కొనినట్లాయే       చక్కని రక్ష కలదటంచు గుండెల పెను        ధైర్య మొదవే       పక్కనున్న వారి  సాయమది చిక్కటి        బలము ప్రాణి       కొకరి నొక రాదరించుట సదా  క్షేమకర                  మందరికిన్ !                                 ****