ఏకానేకుడు!
విశ్వరూపాన్ని,వటపత్రశాయి ఉదరంలో చూసిన మార్కండేయ మహర్షి,ధర్మరాజుకి చెప్పిన, విశేషాల నేపథ్యం తో వ్రాసినది:,
(మహాభారతం,వనపర్వం )
ఏకానేకుడు!!
ఎవ్వరు లేని నిరామయమ్మున, ఆ జలా ర్ణవమ్మున/
సవ్వడియే లేని నిబిడ మౌనమ్ముల యు గాంతమ్ముల/
నవ్వుచు డోలలూగెదో దేవ,ఓంకారమ్మది
నీ లోనే /
రవళింప,అనధ్యయన వేళల ఋష్యాశ్రమ సమువై!!
( ii)
జగద్భాండములనె కుక్షిని దాచిన లక్ష్మీ ధర హరే,స్థూల/
న్యగ్రోధము పగిది కాదే నీ సంకల్ప బీజ ప్రభ
వమై పృథు/
సగుణమ్మంతయు,వెలయించి ఒకపరి,లోగొని నొకపరి/
మంగళమనెడి నవజాత మూలకందములీవె యగుచున్!!
*****
(అనధ్యయన వేళల్లో/రోజుల్లో వేదం బోధింప బడదు, పఠింప బడదు కానీ ఆ ఆశ్రమ వీధుల్లో, గాలిలొ, ఆక్కడే ఉంటుంది, వినిపించకుండా!
అట్లాంటి ఆశ్రమ సమం ఈ ఉదరం! ఈ స్థితిలో వేదాలు, వినిపించట్లేదు కానీ ఆయన లోపలే ఉన్నాయి అని)
****
Comments
Post a Comment