క్షమా ద్వయి!
క్షమా రూపయౌ క్ష్మా తలమున రంగవల్లుల తీర్చిర
సమాన దక్షతల నంగన ల్జిలుగులౌ అల్లికల!
అమ్మహి పోలికయె నక్షయ తాల్ములు కారె వీరును
అమ్మలై,కడుపుల దాచి రక్షించు వాత్సల్య లక్ష్ములై!!
***
హైమావ్రృత గగన వీథుల నొద్దిక దాటి
మమ్మాదరింప వచ్చె నిదె కవోష్ణ కుశల,
ప్రేమామ్రృత సంవర్ష,పౌష్యాభ,సదార్భటిన్!
భామా కరాగ్ర నిస్స్రృత శ్రీకళా వల్లికయై!
***
Comments
Post a Comment