జై జగన్నాథ!!
సుర నందనవన పారిజాత స్యందనమున
స్వారి వెడలె నేడు,పూరీ మాడవీథుల హరి,
సిరి నేలు, భూరి కరుణల, జగ దధికారి!
మరి మరి మ్రొక్కరె,మరి మ్రొక్క నక్కర లేకన్!!
****
క్రృష్ణావరజ సుభద్ర దలచి పారిజాత
పేశలములు/
క్రృష్ణాగ్రజు బలభద్రు నెంచి వీరత్వ కేతన
సుప్రభలు/
క్రృష్ణు,దుర్జనాసహిష్ణు,గుణవర్ధిష్ణు,భావించి, స్యందనము/
క్రృష్ణ మయములా తలపులు రథ నిర్మాతకు
భక్తి పేర్మిన్!!
********(
Comments
Post a Comment