ఓం నమో వేంకటేశాయ!!
అశేష సంఖ్యల నిను దర్శించు భక్త జనుల
విశేష దయా సువీక్షణముల శాంతి కూర్తువు
సాశామతుల కనంత మనోరథ సంపూర్తితో
అసంగ నిరీహుల కానందవల్లీ పోషణతో!
(ii)
దోషము లెన్నక మమ్మాదరించు జగత్పితవు
శ్రీ శ! వీడకుర కరమెన్నడు, శ్రీ వేంకటేశా!!
2
కోర్కెల వారికి కొంగు పసిడియె,కోరని
సూరికి పొంగు ఆనందమె,నీ సుదర్శనము!
ధరను ధర్మ జీవన ఆలంబమై నిల్చి,మా
పరముకై వెల్గు జూపు పెన్మహిమర అది!!
(ii)
అండపిండబ్రహ్మాండముల,లీల నేలు ఱేడ!
కొండలరాయ! తిరుమలేశ! రమాహ్రృదీశా!
Comments
Post a Comment