విరివర!!
విరివర!!
పంచ దళముల నవోత్ఫుల్ల మందారమది/
పంచ విరిశరము లోటువడిన పీఠమున/
పంచాగ్నుల నడుమను తపియించిన కోమలి/
మంచుగుబ్బలి సూతికి జయ,ప్రియకారి కాదే/
(ii)
మించు కన్నుల ఱేని కొలుచు తఱి,దీని చూచి,/
చూచె స్వామి తన్నంచు,ఆ దేవి సమాదరింపన్!!
వివరణ:
"మందార కుసుమ ప్రియా" అనే లలితా సహస్ర నామం ఏర్పటానికి,ఒక కారణం ఇందులో చూపించే ప్రయత్నం!
ఎక్కడైతే, మన్మధుడు అపజయం పాలయ్యాడో, ఆ ప్రదేశం లో,అంటే శివుడు ధ్యానం లో ఉన్న చోట,ఈ మందారము ఆమెకు విజయ కారి అయింది అని!
ఆయన పూజకై, ఈ మందారాలు తీసుకు వెళ్ళినపుడు ముందుగా పూలను చూసి, తరువాతే తనను చూసి ప్రసన్నుడయ్యాడు.
ఆ రకంగా ఇవి విజయ కారకాలు అయినయ్యి, పార్వతికి,కనుకనే ఎప్పటికీ ఆమెకు అత్యంత ప్రీతికరమైనవిగా మిగిలి పోయినాయి అని!! *****
Comments
Post a Comment