వేప త్రయం!!


                            వేప త్రయం!!

1
వేప తినగ చేదేమొ కాని,యెన్ని లాభములుర/

ఏ పగిది చూసిన బాగె, ఒంటికి, ఇంటికి మరి/

మీ పసిడి మై చాయకును,మీ దంతపు సిరి వెల్గు/

కా పర్వెడి కనుల చలువ కాంతికి,మీ మన్కికిన్!
*****
2
వేప ఉండనె వలయు,ఆ మామిడి పులుపు,బెల్లపు తీపుల/
ఒప్పగు నేస్తమై,మన ఉగాది పచ్చ డిలో,పోపుల వింతయై!
****
( ఈ "పోపు", వాటికన్ లో కాదు ఉండేది,మన వంటింట్లో!!)
*****
3
వేప,సొగసుల పత్రాభిరామము,శ్వేత పుష్పాభిరామము/

ఓపలేని తిక్తమైనను, మేల్జేయు దివ్యౌషధాభిరామము/

ఆ పైర గాలి కూగేటి రెమ్మల,హరిత నేత్రాభిరామము/

మీ పొలమునలసిన తరి,సేదతీర్చు ఛాయాభిరామమున్
                            *****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!