త్రివిధ!



                                  త్రివిధ:

1.ఉమ హ్రృది:

హరుడటే,లోక కల్మష హరుడటే,శశికలా 
ధరుడటే/
కోరి కరము కోరి,ఆ కరకు శీతాతపముల 
తపియించి/
నిరాహారనై,నిర్జలనై,అపర్ణనై ధ్యానింప 
ప్రసన్నమైన/ 
ఆరనిఅనాదిదీపమె,జగదాధారమె,నా మహద్భాగ్యమే!!
*****
2.శివ హ్రృది:

నాలోని సగమై తోచు,నాదు సంకల్ప ద్రృశ్యరూపమై వెల్గు/
మేలారయ, వాగర్ధ సంప్రృక్తత తోచు, నిరతైక పూర్ణతన్!
***** 
3.పాఠమిది:
ఆమె అస్తోక తుహినాద్రిరాజ నందిని,అత డాది
దేవుడు!/
ఈ మారుడె,కుసుమాస్త్రములె చాలుచాలు మేరు
ధనువు కని,/
ఏమరి,సంధించి మల్లీ మాలతి శరముల తాపస
హ్రృదిపై/
నిముషమున రూపరె యనంగుడై,భస్మీభూతాలేఖ్య తనువై!
                            (ii)
ఓర్తురె, పెద్దలు జగచ్చాలన చణు లితరుల ప్రమేయము/
నేర్తురు కారె,ఒద్దిక సతులతో జీవించుట మన్మథులైనన్!!
*******

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!