అమ్మ!!


ఉప్పుమూట నేనై బాగ ఊరేగుటకు పల్లకీ మా అమ్మే/

చెప్పి మైమరపించు,కంచికి పోని కథల కల్పవల్లి అమ్మే/

మెప్పు పొందినను,తప్పు చేసిన, చెప్పుకొను దేవి అమ్మే/

గొప్పగ పేరైనను, నా 'కన్న' యని నోరార పిలచున దమ్మే!
                                 ****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!