తల్లి!!


                                 తల్లి!!

ఏ నాటికైన ఆ ఇంటికి సాగనంపక తప్పని ఈ నా చిట్టి/
 
ఈ నాటి నును చివురు పాదమిది, నా దోయిలిని అద్ది పట్టి!/
   
నానాటి కింతింతయై రాణి లాగ వెలగాలని ఈ కన్న తల్లి,/
 
ఏ నాటి కీలాగె చేతుల్లొ బొమ్మయై ఆడాలని,ఓ వెర్రి కోర్కి!!
********************************************
(భూమిజ యైన సీత గురించి,తల్లి భూదేవి అనుకున్నట్టు!
1.సీతారామకళ్యాణం,రాజ్య త్యాగం.
2.వనవాసంలో రాముడిని అనుగమించటం
3.అగ్ని ప్రవేశం
4.లవకుశుల నప్పగించి,భూమిని చేరటం-సూచితాలు!)

ఈ సుపది యే శ్రీ కరముల చేపట్టి, యే పదవి త్యజించునో/

ఈ పదము లే సుపదముల పట్ట యే వని కనుగమించునో/

ఈ పదము లే కటుపథముల నోర్వ మి, ఏ పావకమగునో/

ఈ పదము లే దుష్ప్రథల బాపి నిర్లిప్తయై,నాలోనె చేరునో!
            ‌‌.       *****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!