బాపిరాజు!
అడివోరి చిన్నవాడు, ఏ సడి సేయడెపుడును
మిడి మిడి గీతల,రాతల కెంతో దూర మితడు!
కాల్పనిక జగతీ విహరణల వివరణల
ఈ లోకరీతుల,సాగేటి పలు సాము గరిడీల
శాక్యముని శాంతి బోధల,శాతవాహన గాథల
సకలాంగ సుందరమై తీర్చి చెక్కు శిల్పి ఇతడు!
సరళ రమ్య చిత్ర రచనల రేఖా విరించీతడు
పారేటి కిన్నెరసానియ,కచ్ఛపీ హస్త వాగ్దేవియ
సిరులొలుకు శశికళయ,వీర సముద్రగుప్తుడ
పరమ సహజతల కాటపట్టులు,ఒజ్జబంతులు!!
మెత్తనౌ పలుకుల,సుతి మెత్తని మది తలపుల
ఎత్తరి చూతునో నాదు కలల కవన లక్ష్మినని
చిత్రమౌ తపము చేసిన రసపిపాసి,"బాపిబావ"!
చేతులెత్తి ప్రీతి మ్రొక్కుదురాంధ్రు లాదరమ్ముతో!
******
Comments
Post a Comment