రావమ్మ భవానీ!!


శరన్నవములొచ్చే రా రావమ్మ గిరి రాజ నందినీ!
వర సిద్ది గణేశుతో,స్మరకోటి లావణ్య స్కందుతో!
                             ****
కనక ధారా వర్షి, హరి అనుగు  దేవేరి, లక్ష్మితో
పూర్ణవిద్యా కలశి,విధి చెలిమి కాణాచి,వాణితో!
                              ****
నిర్విఘ్నకార్యులై,నిర్జితారులై,శ్రీ,విద్యా,ఘనులై,నీ
సర్వాభయ రక్ష, అక్షయాంబ,దుర్గ, జనులెల్ల వెల్గ!
           .                   ****
రాలేదనుకోము ,దేహార్ధమై నీ లోనే లేడే శివుడు!
ఫాలాక్షుడైన, జాలి గల యెద,భవహరుడు సదా!
                                ****
(రెండు,మూడు,నాలుగు పాదాలకు,5 వ పాదం తో క్రమాలంకార బంధం)

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!