పౌష్యలక్ష్మి!



పట్టు పరికిణీ గర గరల, బెట్టు పల్కుల గల
గలల/
బిట్టు పుడమి తల్లి మది పులకించ,ముగ్గు లేసిరే లేమలు!
జట్టులై వచ్చు ఆ హరిదాసుల,ఈ గంగిరె ద్దాసామి జోరుల/
కష్ట ఫలమై పుట్ల ధాన్యాలు,బళ్ళ సందళ్ళ వేగ 
నిలు జేర!
                                  (ii)
సంక్రాంతిలక్ష్మి తనిసి,మొగము వేయందముల విరిసినట్లు/
ఏ  కాలమైన  పరుల  కిచ్చినదె, అసలు  సిరి యనినట్లు !!
                                *****
                   కనుమ సందేశము!!
కనుమ నాడు గొనుమ ప్రతిన,దయ పొంగారగ కనియెద 
నేనెల్ల ప్రాణుల నని,కనగ నిను కనుగవ 
తోచని ఆ 
అనంత శక్తి కరుణతో!శాంతమె నీదు శ్వాసాంతము నిక్కమౌ/
ధనము కాదె,నీ దయ చుట్టమైనిన్నె సుఖియింప జేయగన్!
***************************************
హనుమ సందేశము లోకమాత హవ్యవహ పూత 
సీతకు నూరట నీయగ!
కనుమ సందేశము ప్రాణత్రాత లా గవ్య బ్రృందము 
కాదర మీయగ జేయదే!!
*****************************************

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!