శ్రీపాద!!
శ్రీపాద!
సాము గరిడీలలో జబ్బలు చరచిన జోదు
.ఏమి రోగమో ఇట్టె కనిపెట్టు పేరున్న వెజ్జ
సామ గాన సారమున ఒజ్జలకె తొలి ఒజ్జ
అమరపురి కేగె శతాయువై,విమలహ్రృది!
శ్రీ పాద,సంగీత శిక్షణా,రచనా యాగ హోత!
ఆ పినాకపాణీ సమాశుతోష సుస్వర దాత!
శ్రీపాద,స్వర సుధాన్వేషిత శిష్య తీర్థపాద!
అపార గీత పారావార చుళుకీక్రృత ధీవర!
ఆ పినాకపాణి, నాద మయ తనువు!
ఈ పినాకపాణి, రాగ లయ గురువు!!
ఆ పినాకపాణి, సుర నదీ ధరుడు!
ఈ పినాకపాణి, స్వర నదీ హ్రృదుడు!!
Comments
Post a Comment