శ్రీ బాలమురళి!!
1
బాలుడె వీడు?!,సంగీతజ్ఞాన పితామహ
సన్నిభుడు,/
ఖేలనమై సహకార విశేషముల నారి
తేరుచు!/
అల లీలాక్రృష్ణు మాడ్కి,పాడునది తానె,
వాయులీన/
తాళవాద్య గోపికాక్రృతియును,గాంధర్వ బ్రృందావనిన్!!
****************************************
2
మొక్కెద మంగళంపల్లి మురళీరూప సరస్వతికి
అక్కజమౌ పూర్వార్జిత సుసంగీత ధనదాక్రృతికి
పెక్కు వాద్య విశేషముల నశేష ప్రతిభా జ్యోతికి
చుక్కల తాకు ఆంధ్ర శేముషీ జయకేతన దీప్తికిన్!!
Comments
Post a Comment