నిరోష్ఠం!!

                      (శ్రీ ముత్తయ్య భాగవతార్)

                        నిరోష్ఠం!!
ఘన కనక రత్న హార ధర గాత్ర శ్రియుడు/

సునాద లహర్యనేక  క్రృతిఝరీ సాగరుడు/

ఆనూక తుల్య నూతన శ్లాఘ్య రాగ దుకూలుడు/

అనూన ఖ్యాత,గాయన కళా సుధా కలశుడున్!!
                             ***
(ఓష్ఠ్య రహితంగా వ్రాసినది,ఆయనకు నివాళిగా)
*****************************
(ఓష్ఠము=పెదవి;
ఆయన  కనుక్కున్న కొత్త రాగాల్లో కర్ణరంజని,బుధమనోహరి,విజయసరస్వతి మొదలైన రాగాలతో పాటు "నిరోష్ఠం",అని ఒకటున్నది.

ఇది పెదవులతో పలికే స్వరాలు,మ,ప లు వాడబడనిది.
అంటే ఓష్ఠ్య రహితం!
ఆయన ఆ రాగంలో కూర్చిన "రాజరాజరాధితే..."లో కూడా ఓష్ఠ్యాలు వాడకుండా వ్రాశారు.)

:

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!