సౌందర్యధార!!
అంగజు గాచిన యగజ మానస పుత్రు తొలి రూపైనట్లు/
చెంగట లేని సీత చీర సౌరై, రామచంద్రుకు తోచినట్లు/
బంగరు, లేలేత రేకుల లతాంత శిల్పమై
వెలసినట్లు/
ముంగిటి గడప పసిమి,వేడుక పుష్పాక్రృతి దాల్చినట్లు!!
(ii)
భంగము లేని సుందరతా ధార,ఆ దేవదేవు
కల్పనా ఝరి/
చెంగనాల్కావె ననలు,వన్నెలు, సొబగు చిన్నెలై
యీ యిలన్!
*****
Comments
Post a Comment