ఏమందువో?!
అమ్మరొ,నీ పదాబ్జ దయాసువనముల వ్రాల మందువో/
కొమ్మల, గుణ సీమల సిగ, నెత్తావుల నింప
మందువో/
కమ్మని విందై, జనుల కనుగవ కర్పణ
కమ్మందువో/
ఇమ్ముగ విరిసి వేచితి మానతి నీవె,
పాటలీ ప్రభా!!
******
("పదాబ్జ వనం" లో సాముద్రికం సూచితం!
పద్మ శంఖ ముద్రాంకితాలు,ఆ పాదాలు అని!
అట్లా ముద్రాంకితాలైన ఆ పాదాలు,దయా వనాలు!
అందులో మళ్ళీ పద్మాలు!)
Comments
Post a Comment