పట్ట నేరని వాడు!!


పట్టు తలపాగ చుట్టిరే,తాపసులె పట్ట నేరని 
వానికి/

కట్ట బోయిన, నోట లోకాల చుట్టచుట్టీ చూపిన ఘనునికి/

పుట్టుగ్రుడ్డి సభ న్గారవ పుట్టముల,చెల్లి గాచిన వానికి/

బెట్టుల బోక,పెంపేద మిత్రు చేతి నటుకులు గొన్న వానికి!
                        ‌‌‌‌ ‌‌
                                   (ii)
ఏ భూష మకుటమయ్య జగదేక పతికి,వేద 
సంకీర్తికి/

సద్భక్తి నిడిన,తోయములనె తనియు, నల్ప
సంతోషికిన్!
                               ******

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!