ఏకానేక!!

ఏకానేక!!

ఇంటి పనుల నష్టాదశ భుజ,ఇంటి పొదుపుల 
శ్రీ లక్ష్మి,/

వంట,వడ్డనల అన్నపూర్ణ, పిల్లల చదివించుట వాణి,/

కంటి ఆజ్ఞలనె యధ్వర్యము జేయుట న్పర్వత రాజపుత్రి/

పంటి కింది రాయై కడు వేధించు తుంటరులకు దుర్గాశక్తి!
                              ******
చెలరేగు నన్యాయముల నెదిర్చి చెండాడుట భద్ర కాళి/

ఖలుల  నణచుటను మహిషమర్దిని, లక్ష్యపూర్తి న్చండి!/

విలువ యెంతని,యెటు కట్టెదవయ ఓ పురుష పుంగవ!/

కలిమియై నిల్చె కాదె, నీ యింటనె నవశక్తు లేకత్రమై!!
                              ******

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!