నాద యోగి!! Get link Facebook X Pinterest Email Other Apps - May 04, 2022 వలదనె రాజ ధనముల, మెరమెచ్చపు జేజేల,నిలిపెనె రామునె సొంపైన చంపకపు తలపుల! సలిపెనె నూరుకోట్లను దరియ నామ జపములకలిసెనె ఆ రామబ్రహ్మములో,నాదయోగమునన్!! Get link Facebook X Pinterest Email Other Apps Comments
విరి (యు) వైనము! - April 25, 2020 గుప్పిటల దాచిన రత్న మాణిక్య ధగ ధగలను ఒప్పుగ భద్రహస్తముల విప్పి చెప్పు వైనమున ఇప్పూల ఠీవులేమొ,విరిసినవి కనుగవకు విందె మెప్పుగ క్రమసుందరమై విరియునవియున్!! విరిసిన విరి అందమ?! విరియుటయుఅందమ?! విరియు దశ నందుట అందమ?!విరియ జేసిన కరము అందమ,మనఃసుమ భావగంధములగొని అరమరికలేమి లేక నిజముగ చెపుమ లీలాకృష్ణా Read more
అతిథి! - May 31, 2020 దారి తప్పిన అనదయ, ప్రతిబింబ శిఖిని బరి లోకి రమ్మనుటయ, ఇంటి చినవాని హరి మూర్తి యగు కృష్ణుగ తలపోసి,మెచ్చి బర్హ సౌందర్యము చూపుటకొచ్చినద,చెపుమ! Read more
ఎదురు చూపులు! - April 02, 2022 బేల చూపులవి, దేనికే కపిల! జాలి ద్రృక్కులవి, యేటికే ధవళ! తల్లి ప్రేమలవి, యేరికే సుఫల! మల్లె సురభుల దాగు,ఆ బాలుకే?! (ii) వ్రేపల్లె విడచి, కాళింది నొదలి ఏ పొద్దు రాడేమొ,గోవింద దేవుడు? ! ***** Read more
Comments
Post a Comment