పూజలో శ్యామక్రృష్ణ!
పూజలో శ్యామక్రిష్ణ!!
ఒరయు కావేరి స్నానమాడి వెలుగు రేకల పల్కరించుచు/
సరిగంచు పట్టు ధోవతితో విభూతి కుంకుమల మించుచూ!
****
పూదోట తానె గోరానిన మందార మల్లెలు మంచి గంధాలు/
చేదాల్చు వెండి సజ్జ పద పదమన చేరెనే అమ్మ
గుడికి!!
****
వేద కాంతియై భాసించు సిరిమోముతో సామోద సదాక్రృతి/
సుధ్ధ్యాన ముద్రయె నడచినట్లు శ్యామక్రృష్ణ,తల్లి
పూజకై!
****
నుత శచీశ సేనాని, క్షిప్ర ప్రసాదిని,సుతు కానో,
పరాకేల?/
నత జన పాలిని, అమ్మ మాటాడవేల నాతో,యని
వగచె!
****
బంగరు కామాక్షి మందిరమ,హ్రృదియె జనని
మంటపమ/
పొంగెడు అందెల నాదము సాగె, నెవ్వరు వినని సవ్వడియై!!
****
గంట మౌనముదాల్చె, దీపమచలమై నిల్చె, కాలమె ఆగెనొ?/
కంట జగతి పాలించు కామాక్షి కళ, కరుగ శ్యామ క్రృష్ణలో!
****
వేదార్ధములె బోధించెనో సంగీత అగాథాంశములె చెప్పెనో/
ముదమార అంబ మాటాడె తనయుతో,ఆతడవాక్కై వినగ!
****
సదార్తిగ పిలచిన రాదె తల్లి బాలుని యొడి జేర్చి లాలించ/
పదారవిం దాశ్రిత జనావళికై దయా సు లలిత
పాలించ!
****
Comments
Post a Comment