సత్త్వ శిల్పి!
ఏ కమనీయాకృతులు మెదల నపూర్వతూలిక
పట్టి
ఏ కనుల పడని యదృశ్య శక్తియై రంగురూపు
లద్ది
ఏ కోమల భావనల ఆ సతత సాత్త్విక శోభా
మూర్తి
ఈ కమలారుణిమల తీర్చెనో భువి యెవ్వరి
కెరుక?!
**
ఆ కోటి ధారల హరి కౌశల చక్రమునకు
మౌనిగ
సాకల్యప్రపత్తి సాష్టాంగమ్ము చేయుటదొక్కటె కార్యమై!
Comments
Post a Comment