రాముడొచ్చె!!


                        రాముడొచ్చె!!

రాముడొచ్చినాడు రాజు ఇంటికీ, భక్తి రాజు ఇంటికీ
భామ సీతతో అనుజు లనుగు హనుమతో, ప్రేమతో

మాటమల్లెల పాటల కట్టీ,నీల మోహను మ్రోలను
పూటపూటకుంచు,త్యాగరాజునిచూడ,పరబ్రహ్మమౌ

రాజారాము డొచ్చె నిదె, వినీతుడై  దాస వసతికీ
పూజా ఫలమై, యోగాదుల కందని సగుణ రూపుడై

నిధుల, ప్రభు సన్నిధుల కాదన్న వైనపు బలమొ
మాధ్వీ ద్రాక్షా ఫణితుల క్రృతి మాలికాతతి చలువో

వేద రూపుడిల తా నవతరించి, దేవ కార్యముకై
గానమూర్తియౌ పుణ్య శ్లోకు,తీరిక కలియు నెపమొ

కరి గావ మకరి  ద్రుంచి,  క్రృష్ణకై వడి పుట్ట మిచ్చి
ఆరి నడచ న్రృహరియై,యీతడె!దయాభిరాముడై!

తీరుల రామ రామ యను, జ్ఞాన కీరము నరయగ
కోరి వచ్చె కోదండరామ నామ, శార్జ్ఞపాణి హరియే.
                              *****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!