ఇది సులువే!!
వసి వాడని కళల, యీ పాలు గారెడి పసి బాలుడు,
వశమె కాని పని బల్జోదులకైన, నెటు కా జేసెనే?!
ఆశ్చర్యమౌ!యనుచు వ్రజవాసులు గుసగుస లాడిరి
వెస నంగుళి గోవర్ధన మెత్తిన గోప కిశోరు గాంచి!
(ii)
గగన ధరణీ మండలముల పలు బ్రహ్మాండముల లీల
నగుచు భరియించి పోషించు నా శ్రీహరికీగిరి,బరువే!
Comments
Post a Comment