నవీన రాత్రీ సూక్తం!!
నిద్రకల్లన జార్చి మనుజుల, సేద దీర్చు
తల్లివె నీవు/
భద్రతల కొనితెచ్చు యుషోదయమ్ము
కద్రృశ్య సోదరివై!/
క్షుద్రత ల్లేక పరతు విరుల సమత న్నీవు
నిర్నిద్రవై ,/
ఛిద్రము కాదె మనికి,నీవు వినా,ఓ శర్వరీ
దయాకరీ!
*****
ఇంత పట్టు సడలక, ఎప్డు ఆశ వదలక
యత్నశీలత కాదె మనిషి విధి, ఆ పరిధి!
నిత్య క్రృషిలో దాగి లేదె,వేకువ కంకురము!
మాత నిశీ!నీవె వెల్గు రాక, శుభసూచకము!
Comments
Post a Comment