తరంగానందము!!
నారాయణ వర తరంగముల ఆడి పాడిన
తీర్థుడీతడు/
పారాయణల నందర కుహూస్వర విహంగములై మార్చినాడు/
మారాముల బాలక్రృష్ణ లీలాంగణ రేఖాచిత్రముల
గీసినా/
డారామ సుందరముల విహరింపరె కైవల్యార్థు లెపుడున్!!
****
Comments
Post a Comment