జానకీదేవి!!
రాణిగ, సింహపీఠి నలంకరించు క్షణమున, కానల కేగితివి/
రాణగ, పతిని చేరు ఘడియ,కణ కణల పావకు జొచ్చితివి/
రాణిగ,యింత సుఖియించు తఱి,త్యాజ్యవై ఆట వుల మిగిలితివి/
పూర్ణగ, శీలపూర్ణగ,వీరసూనుల పతికిచ్చి, ధర చేరితివి!
(ii)
మణివమ్మ, భరత వనితా ఘన చరితానర్ఘ శిరో మణి వమ్మ!/
గుణరత్నసంఘాత సుశ్వేత ఓ సీత!క్షమా ప్రపూత!సత్త్వ నిత్యస్థా!
****
Comments
Post a Comment