వివేకము




అటునిటు పాఱు మెత్తటి అల్లరి, కుందేటి పట్టి
కెటు లేని కొమ్ముల వెదక పూను మూఢుడొకడు
ఇటునటు సాగు అత్తరువాసనల గులాబీనంటిన
కంటకముల పెకలింప జూచు ప్రోడ ఇంకొకడు!!

కొమ్ములు గల శశము వెదకుటయే శుద్ద వ్యర్థము
అమ్ములవంటి ముళ్లులేని గులాబి ధర దుర్లభము
ఎమ్మెయి చెప్పిన వినని జడు వీడుము,మనమది
ముమ్మాటికిచొరరాని దుర్వనము నిజమునిజము

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!