గంగాళం!


గంగాళంలో ఏమేం పెడతారోయ్

పట్టినన్ని బిందెల చన్నీళ్ళా

స్నానానికి పెదవారికి వేన్నీళ్ళా?!

**

ఇంట్లో విందైతే,

నలుగురు విచ్చేసే సందడి అయితే

నోరూరించే నువ్వుల అరిసెలా

ఏలకి సురభుల లడ్డూలా

అబ్బో అనిపించే అప్పాలా,

కావివేవీ,కమ్మని కజ్జికాయలా,

పొట్టనిండా తినమనే పూర్ణబ్బూరెలా?!

**

ఎప్పటికీ తీపేనా

మీ గంగాళం కారం వద్దంటుందా?!

**

కళ్ళకు ఇంపుగ కరకరల కారబ్బూంది

నిండుగ వాంపూసా,జంతికలూ

పదిరోజులు టపటపలాడే తప్పేల చెక్కలు

ఇంకేవైన మనిషికి చురుకిచ్చే,రుచి మెచ్చే

కారక్కారపు ఊరింతలు పెడితే పాపం!

మీ గంగాళం వద్దంటుందా ఏం?!

**

అమ్మోరికి పొంగలి పాయస నైవేద్యాల

అయ్యోరికి పులిహోరలు దధ్ధ్యోదనాల

సంతర్పణకై కమ్మటి కూరలు,పులుసుల!

బహు దొడ్డది పాత్ర,,ఈ ప్రాచీన ప్పాత్రది!

**

ద్రవమైతే ఓ అంటుంది,ఘనమైనా సరే

ఏ వ్యత్యాసం చూపని ఘన పరిమాణపు

గతకాలపు గుర్తుల తెచ్చే ప్రృథు పిత్తళం,

గంగమ్మతో ఏమో బంధం,పేరేమో గంగాళం!

****"

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!