అపూర్వ స్నేహం!


అందరకు చలువ వెన్నెలల పంచుచును,ఆ నెలరాజు/

కెందు కిల కమల బాలలతో  వైరమనుచు,
తెచ్చి పద/

మ్రృదు కమలము,నిజ చంద్రాస్య బింబము 
దరికి,వెలసె/

నిదె,యనిదంపూర్వ  సఖ్యత  యను  పత్ర
శాయికి జోతల్!
                             *****
(ఒక సంస్క్రృత సుభాషితం ఆధారంగా వ్రాసినది- అందరికీ వెన్నెల పంచే చంద్రుడికి, ఎందుకబ్బా,కమలాలతో వైరమని,అది తీసేసి అపూర్వమైన స్నేహాన్ని నెలకొల్పాలి అన్నట్టు,తన పద కమలాన్ని,చంద్రుని తో సమానమైన తన ముఖం దగ్గరికి తెచ్చాడు అన్నట్లున్న వటపత్ర శాయికి మా నమస్కారములు అన్న భావంతో!)

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!