గోదా!!
తులసి వనమున వెలసిన శ్రీరంగ నాయకి
అలయ దెపుడు,తా విభుని తలపుల మునిగి!
పిలచె నిదిగో చెలుల, పర సిద్ధి వ్రతముకై
అల గోపకాంతు గుణ రూప కీర్తన ల్సేయుచున్!!
*************
తులసి వనమున వెలసిన రంగనాయకీ బాల
తులసి వినునటుల,చేతి చిలుక అనునటుల
పలికెనె పరవశయై,హరే శౌరే యని నోరార
ఇల లోన,కల లోన,మనసంత శ్రీరంగధామమై!!
**************
Comments
Post a Comment