ఏకానేకము!!
జన హితమై రగులు ఆ రవి కిరణము లొకింత
చల్లనైనట్లు
మనసార యిచ్చు శిబి కరాబ్జము వేయి దళముల
తా,/ విచ్చినట్లు
ఘనాతిశయి సాత్రాజితి సిగ పసిడి నాగరపు
రేకుల యట్లు/
మనోన్మని, ఆ పరమ యోగి విరిసిన పూర్ణ మేరు
కమలమట్లు!
(ii)
ధర్మ సంస్థాపనా సునిశ్చయ మూర్తి, చక్రి సుదర్శన
శితములట్లు/
మర్మమేమొ యొకటె కల్గించె,పలుయూహల,తావుల
పరచుచున్!!
*******
Comments
Post a Comment