మూలమేది?!
శ్రుతి పక్వమగు నిజ తంత్రుల లోనొ
శ్రుతి సుభగముగ మీటు వ్రేళ్ళలోనొ
కతిపయ వాదిస్వర మేళములోనొ
ధాతువేదో ఆ విపంచీ మాధురులకు?!
(ii)
ధాత వ్రాతయె యని సద్గురు తీర్మాన
మే తలిర్చు సునాద పూరణ కైనన్!!
****
("సీతావర, సంగీత జ్ఞానము ధాత వ్రాయ
వలెరా" అని ఒక త్యాగరాజ కీర్తన!!)
Comments
Post a Comment