వ్రృషభ గీతం!
ఓయి ఏమిత్తురోయి,దేవ
దయ లేని వారీ ఇలను!
*
మోయగను బరువులే గాని
కాయగాయ మా కాయమది!
*
రేయి వాల్చినదె యీ మేను
ఆయువె తరిగె కరిగెనిక!
*
మా నేత నందైన చెప్పడో
మానేదెపుడో కాఱు చాకిరీ!
*
నోరు వాయీ లేని ఈ జీవిపై
కరుణించర శివ,కనుల చూసీ!!
****
Comments
Post a Comment