ఉపకారి!!


పోసినదెపుడో చిన్నపుడిన్ని నీళ్లు,నీదు పాదున/

కోసిన కాయల,త్రాగిన ఖనిజ జలముల లెక్కేలేదు/

వేసిన పెళ్లి పందిళ్ళకు,చేసిన చీపుళ్ళ కంతు లేదు/

ఓసి కొబ్బరి,ఇన్ని మేళ్ళు మాకు కట్టబెట్టిన,నీవు!
                                 (ii)
అర్ధులకిచ్చి యిచ్చి, బాగ సంతసించు దాతవు కాదే/

పాదప మందార, నారాయణ రూప,నారికేళ విభో!!
                                 ****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!