పరీక్ష!!


                    
 

అక్ష క్రీడ,మాయల జిక్కి,కాంతారవాస ఖిన్నుడైన

రూక్ష ధర్మ బుధ్ధి,యుధిష్ఠిరుడు,సారపు పల్కులన్

యక్షు మన మలర్ప జేసి, శుధ్ధత  నడిగె నకులు,

ఇక్షుధన్వి సమ సుందరు ప్రాణముల్,సమవర్తియై!
                               *****
ఈ ధర్మ సంకట యుధ్దం/ సమస్య లో స్థిరంగా నిలిచాడు కాబట్టి "యుధిష్ఠిరుడు"!

ఎట్టి పక్షపాతం లేకుండా, సమానమైన ధర్మ బుధ్ధితో,మాద్రి పెద్ద కొడుకును ( కుంతి కొడుకు
ల్లో తను ఉన్నాడు కాబట్టి) బ్రతికించమని కోరి
నందువల్ల "సమ వర్తి"! 
వారి తండ్రి పేరు ధ్వనించటం యాదృచ్ఛికం!!
                           ******
 

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!