అహంకార దష్టుడు!!
వేదవిదుల తపోధనుల జితేంద్రియుల/
ఇంద్ర పదవీ దర్పాహంకార విస్మృతాత్ముడై/
పద పద మని తొందరించి ఆ నహుషుడు/
వీతక్రోధుల శాపవాక్యము ల్పల్కగ జేసె!
(ii)
తొందరయే లేని తామసాజగర రూపియై నవయ
పద విహీన శప్త జీవన సుప్త సత్త్వముగ వనిన్!!
****
నహుషుడ జగరమయ్యే అవిద్యా బృహ ద్రాశిగన్!!
*****
పవనున్ బంధించి పంచేద్రియ నానా వ్యాపా రముల్గట్టి/
ఆవ్యోమాంతముల మీరు అక్షరానంద సుప్ర
భల్ జూచు/
అవ్వింధ్యవారణాది మహర్షుల నిందించు ఫ
లము జేసె/
పవన భుక్కుగ నహుషు, దుష్కర్మ లూరక విడచునే?!
****
నడమంత్రపు సిరి తలకెక్కి నాడింపగ/
నడు నడుమని తొందరించె మహర్షుల/
అడుగంటి భాగ్యముల్ అజగరమయ్యే/
విడువడు నహుషుడు ప్రగల్భతలన్!!
*****
Comments
Post a Comment