రేఖ!!
నాడు - లక్ష్మణ రేఖ:
మరిది గీసెను రేఖ,రాకమ్మ వదిన,దాటి యనుచు
సొరిది తప్పుచు,పరుసములాడి,పంపితి వాతని
తరుముకొచ్చెను దుర్విధి రావణ కాఱు మొయిలై
ఇఱ్రిపైనాశ,నైరుతి నట్టింటికినిప్పులనినుద్రోయన్
నేడు - లాక్డౌన్ రేఖ!
చెరిపి గీతలన్ని,మ్రింగినవాని లెక్క,నీకేతెలియదు
సర్పమునకు కప్ప,కప్ప కోగిరము కీటకముదానికి
చిరుక్రిమివేరొకటి,ప్రకృతికట్టుబాటిదిభగ్నముచేసి
అరచేతనసువులనున్నావుతెలిసెనోరేఖమహిమ
Comments
Post a Comment