Posts

కనకాంబర!

Image
అహో కనకాంబర ధారిణి ఆయెనే నేడంబరము మహారాజ్ఞి ఆర్యా మహాదేవి త్రిపురసుందరి మెచ్చ బ్రాహ్మీ వేళల దర్శించి యొచ్చెనో కైలాసాచలమున విహాయసాంగణమెల్ల పాటలారుణముల శోభిలెన్!√

గోరక్ష!!

Image
ఇంటి లోన ఎవ్వరమ్మ అన్నపూర్ణ లిటు చూడరే సుంత  కంట నిండు ఆశల వచ్చినాము గో గోవత్సముల మిప్డు  కంటకములై మము బాధించు తుంటరుల పని పట్టరె వెంట పతి సుతులు,క్రృష్ణచక్రోపమ ఆస్థ రాగ మీతోన్! 

ఊహాపుష్పకం!

Image
ముందుగ ఊహలేనోయి ఇహలోక సుఖ సాధనల న్ని/ అందముల మీ ఆలోచనల కడ్డేది లేదు  నింగి  హద్దై!/ ఎదుగుటఎగయుటతథ్యము మీఆశల  గుమ్మటము/ పదిలముగ పూని గట్టి మేలొకటి సేయు  మందరికై!!

గజస్నానం!!

Image
మనసార గజరాజు తనువార జలక మాడెనే  అనువైన స్థలమున అరుదైన ఒడుపు జూపుచు! తనువు వంచని నిట్టనిలువుల నిండు గంభీరము తనను తాను అభిషేకించు దంతిప్రభు విభవమ్ము!

అమ్మకాలు!

Image
పాలోయమ్మ పాలు పాలకుప్పుల జోడగు మాధేను తల్లులవి తెలుపోయమ్మ తెలుపు,పున్నమి వెల్గుల కమ్మని రుచులివి మేలోయమ్మ మేలు,ముదమార వీని నెంచి,నోరార పిలచిన ఏలోయి బాలగోపాల యదుబాల గోపికా రాగ కుందమాలా !!

గంగాళం!

Image
గంగాళంలో ఏమేం పెడతారోయ్ పట్టినన్ని బిందెల చన్నీళ్ళా స్నానానికి పెదవారికి వేన్నీళ్ళా?! ** ఇంట్లో విందైతే, నలుగురు విచ్చేసే సందడి అయితే నోరూరించే నువ్వుల అరిసెలా ఏలకి సురభుల లడ్డూలా అబ్బో అనిపించే అప్పాలా, కావివేవీ,కమ్మని కజ్జికాయలా, పొట్టనిండా తినమనే పూర్ణబ్బూరెలా?! ** ఎప్పటికీ తీపేనా మీ గంగాళం కారం వద్దంటుందా?! ** కళ్ళకు ఇంపుగ కరకరల కారబ్బూంది నిండుగ వాంపూసా,జంతికలూ పదిరోజులు టపటపలాడే తప్పేల చెక్కలు ఇంకేవైన మనిషికి చురుకిచ్చే,రుచి మెచ్చే కారక్కారపు ఊరింతలు పెడితే పాపం! మీ గంగాళం వద్దంటుందా ఏం?! ** అమ్మోరికి పొంగలి పాయస నైవేద్యాల అయ్యోరికి పులిహోరలు దధ్ధ్యోదనాల సంతర్పణకై కమ్మటి కూరలు,పులుసుల! బహు దొడ్డది పాత్ర,,ఈ ప్రాచీన ప్పాత్రది! ** ద్రవమైతే ఓ అంటుంది,ఘనమైనా సరే ఏ వ్యత్యాసం చూపని ఘన పరిమాణపు గతకాలపు గుర్తుల తెచ్చే ప్రృథు పిత్తళం, గంగమ్మతో ఏమో బంధం,పేరేమో గంగాళం ! ****"

స్వాగతం!

Image
    విరి లోక మంగళ కాహళులై తోచెనే ముగ్ధ                మందారములు/     వ రాల హేమంత పల్లకి నవతరించు పౌష్య     ల క్ష్మి  కాహ్వాన/     స్వరలహరుల నంపు యిలాతల సుమాకార     ప్రతినిధులై!/     ఈరికలౌ ప్రీతికరముల నిడు శ్రీద సితాంబుజమై      నవ్వన్!